సిక్ లీవ్లో 300 మంది ఉద్యోగులు .. 80కి పైగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాల రద్దు

-

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఉద్యోగులు భారీ సంఖ్యలో అనారోగ్యానికి గురయ్యాయి. దీంతో విధులు నిర్వర్తించే వారు లేక ఈ సంస్థకు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి దాదాపు 80 విమాన సేవలు నిలిచిపోయినట్లు తెలిసింది. సిబ్బంది ఒక్కసారిగా అనారోగ్య కారణంతో సెలవు పెట్టడమే ఇందుకు కారణమని సమాచారం.

సంస్థలో కొన్ని విధానాలపై నిరసన వ్యక్తం చేస్తూ దాదాపు 300 మంది మూకుమ్మడిగా సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. ఏఐఎక్స్‌ కనెక్ట్‌, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విలీన ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ‘క్యాబిన్‌ క్రూ’లో ఓ వర్గం పలు అంశాలపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ విషయాన్ని గత నెల కంపెనీ దృష్టికి ‘ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌’ తీసుకెళ్లింది. సిబ్బందిలో అందరినీ సమానంగా చూడడం లేదని ఆరోపించింది. ఇది తమ స్థైర్యాన్ని దెబ్బతీస్తోందని పేర్కొంది.

అకస్మాత్తుగా విమానాలను రద్దు చేయడంపై బుధవారం ఉదయం పలువురు ప్రయాణికులు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ క్షమాపణలు చెప్పింది. ఏడు రోజుల్లోగా ప్రయాణాన్ని రీషెడ్యూల్‌ చేసుకోవచ్చని సూచించింది. లేదా రిఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news