వరకట్నం కోసం భార్యను చంపిన డాక్టర్… సుప్రీం కోర్ట్ జోక్యం, రంగంలోకి సిబిఐ

Join Our Community
follow manalokam on social media

ఒక మహిళను ఆమె భర్త, అత్తమామలు వరకట్నం కోసం హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో సంచలనం అయింది. ఈ కేసుని సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు సిబిఐ టేకప్ చేసింది. ఆమెను హత్య చేసిన కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో రెండు ప్రాంతాల్లో దాడులు చేసింది. డాక్టర్ అయిన దీప్తి అనే మహిళను ఆమె భర్త హత్య చేసాడు. భర్త డాక్టర్ సుమిత్ మరియు అతని కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్న ప్రాంతాల్లో దాడులు చేసారు.

“ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు మరియు వివిధ బ్యాంకు ఖాతాలు మరియు స్థిరమైన ఆస్తులకు సంబంధించిన పత్రాలతో సహా ఈ కేసుకు సంబంధించిన పత్రాల రూపంలో మరికొన్ని కీలక సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు” అని సిబిఐ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డాక్టర్ భర్త సహా ఐదుగురిపై సిబిఐ జనవరి 22 న కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితులుగా డాక్టర్ దీప్తి భర్త డాక్టర్ సుమిత్, ఆమె బావ డాక్టర్ ఎస్సీ అగర్వాల్, అత్తగారు అనిత, బావమరిది అమిత్, బావ తులికా అని సిబిఐ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. .

డాక్టర్ దీప్తి తండ్రి… తన కుమార్తెను తన అత్తమామలు మరియు ఆమె భర్త చంపారని ఆరోపించారు. నిందితులు నిరంతరం కట్నం కోరుతున్నారని, దాని కోసం తన కుమార్తెను హింసించేవారని ఆయన ఆరోపించారు. అతను కట్నం డిమాండ్లను తీర్చడానికి చాలాసార్లు ప్రయత్నించా అని, కానీ అది తన కుమార్తె అత్తమామలను సంతృప్తిపరచలేదని చివరికి ఆమెను హింసించి చంపారని పేర్కొన్నారు. ఆగస్టు 6, 2020 న దీప్తి మరణించింది.

TOP STORIES

చెప్పినట్టుగానే బీహార్ లో ఫ్రీ కరోనా వ్యాక్సిన్…!

బీహార్ ప్రభుత్వం ఫ్రీగా కరోనా వైరస్ వ్యాక్సిన్ ని అందిస్తోంది. బీహార్ స్టేట్ లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వాక్సిన్ ఫ్రీ గా వేయడానికి...