అంతర్జాతీయ విమానాల రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవ్వాళ్టి నుంచే రెగ్యులర్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఆపరేషన్స్ కొనసాగించవచ్చని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది. “ప్రపంచవ్యాప్తంగా టీకా కరణ పెరిగిందని, కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి,’ ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ విమానాల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
ఈ మేరకు అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సివిల్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ పెరిగిన నేపథ్యంలో సంబంధిత భాగస్వాము లతో సంప్రదింపుల తర్వాత సర్వీసులపై నిషేధాన్ని మార్చి 26వ తేదీన ముగించాలని నిర్ణయానికి వచ్చామని… దీని ప్రకారం ఇవాల్టి నుంచి భారత్ కు వచ్చే, భారత్ నుంచి వెళ్లే అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ ప్యా సింజర్ విమాన సర్వీసులను పున ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పౌర విమాన శాఖ ప్రకటన చేసింది.