Industrial smart cities: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలకు ఆమోదం

-

నేడు సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా కొత్తగా 12 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వీటి ద్వారా 10 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

ఈ పారిశ్రామిక నగరాలు ఉత్తరాఖండ్ లోని ఖుర్పియా, మహారాష్ట్రలోని డిఘీ, పంజాబ్ లోని రాజ్పుర- పటియాల, కేరళలోని పాలక్కాడ్, ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా , తెలంగాణలోని జహీరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని ఓర్వకల్- కొప్పర్తి, బీహార్ లోని గయ, రాజస్థాన్ లోని జోధ్పూర్ సిటీలను స్మార్ట్ సిటీలుగా ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 28, 602 కోట్లు పెట్టుబడి పెడుతుందని తెలిపారు.

దీంతోపాటు 6,456 కోట్ల అంచనా వ్యయంతో 296 కిలోమీటర్ల పొడవు ఉన్న మూడు ప్రధాన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక కడప జిల్లా కొప్పర్తి, ఓర్వకల్లులో భారీ పారిశ్రామిక హబ్ లు వస్తున్నాయని వెల్లడించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కొప్పర్తి హబ్ లో 54 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. అలాగే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ ద్వారా 45 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news