వీధి వ్యాపారం నగరాల్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి అర్బన్ వ్యాపారుల పూటగడవడానికి ఆధారంగా నిలుస్తున్నాయి. చాలా మంది బతుకులు దీనిపై ఆధారపడి ఉన్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం వీరికి చేయూత అందించడానికి దీన్‌దయల్ అంత్యోదయ యోజన ద్వారా ఆదుకుంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. వీటి వివరాలు తెలుసుకుందాం. ఈ స్కీం ప్రధాన లక్ష్యం నగరాల్లో ఉండే వీధి వ్యాపారులకు కూడూ, గుడ్డతోపాటు వారికి సామాజిక భద్రతను అందించడమే లక్ష్యంగా చేసుకుంది.
ఆత్మ నిర్భర్ నిధి..
గృహ మంత్రిత్వశాఖ ఆత్మ నిర్భార్ నిధి (పీఎం స్వనిధి)ని 2020 జూన్ 1న ప్రారంభించింది. మొదట ప్రతిఒక్క వీధి వ్యాపారికి రూ.10 వేల లోన్‌ను వారి వ్యాపారాభివృద్ధికి మంజూరు చేసింది. ఎందుకంటే వీరు కరోనా కారణంగా కూడా చాలా నష్టపోయారు.
పీఎం స్వనిధి లబ్ధిదారులను, వారు కుటుంబ సభ్యులను ఇతర కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయడానికి కృషి చేస్తుంది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన, పీఎం సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ రిజిస్ట్రేషన్, ప్రధాన మంత్రి శ్రమ యోగి మాంధన్ యోజన, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పోర్టబిలిటీ బెనిఫిట్, వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు, జననీ సురక్ష యోజన, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన.
2020 జూన్1 ఆత్మ నిర్భర్ నిధి స్కీంను ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీల ద్వారా అమలు చేస్తోంది. దీంతో ఏడాది గడువుతో రూ.10 వేల లోన్‌ను అందించింది. ఈ లోన్‌ను సకాలంలో చెల్లించిన స్ట్రీట్ వెండర్స్‌కు రూ.20 వేలు, రూ.50 వేలను రెండు, మూడు విడతల్లో మంజూరు చేయనుంది. సంవత్సరానికి 7 శాతం వడ్డీ రాయితీ రూపంలో ప్రోత్సాహకాలు, నిర్ధేశించిన డిజిటల్ లావాదేవీలు చేపడితే రూ.1200 వరకు క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది. ఈ పథకం కోసం 2021 జూలై 30 వరకు దాదాపు 43.3 లక్షల దరఖాస్తులు అందాయి. ఇందులో దాదాపు 25.3 లక్షల లోన్లను స్వీకరించి
, 22.8 లక్షలు పంపిణీ చేసింది.