మెటర్నిటీ లీవ్స్‌పై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం

-

మేటర్నిటీ సెలవులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరోగసీ విషయంలో 50 ఏళ్ల నాటి నిబంధనను సవరించింది. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే మహిళలకు, ఆ పిల్లల తల్లిదండ్రుల సెలవుల విషయంలో కీలక నిర్ణయానికి వచ్చింది. సరోగతి ద్వారా తల్లి అయిన మహిళకు ఇక నుంచి 180 రోజుల ప్రసూతి సెలవులు, తండ్రులు కూడా 15 రోజులపాటూ పితృత్వ సెలవులను తీసుకోవచ్చని ప్రకటించింది. ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్-1972ను సవరించింది.

కొత్త నిబంధనలు ప్రకారం అద్దె గర్భం ధరించేవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే 180 రోజుల ప్రసూతి సెలవులు పొందుతారు. ఇద్దరు కంటే తక్కువ పిల్లలున్న ప్రభుత్వ ఉద్యోగి తల్లికి (గర్భంలోని బిడ్డను స్వీకరించే తల్లి) కూడా ఈ సెలవులు వర్తిస్తాయి. సాధారణ పురుష ఉద్యోగులకు ఇచ్చే విధంగానే సరోగసీ విధానం ద్వారా తండ్రిగా మారిన వారికి కూడా సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. బిడ్డకు జన్మించిన ఆరు నెలల్లోపు 15 రోజుల పాటు పితృత్వ సెలవులు తీసుకోవచ్చు. అతడికి కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదని షరతు విధించింది. సవరించిన కొత్త రూల్స్ జూన్​ 18వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version