సైకిల్ పై పార్లమెంట్ కు… టీడీపీ ఎంపీ ఆసక్తికర నిర్ణయం

-

అప్పుడెప్పుడో పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వ్యక్తులు చట్టసభలకు సైకిల్ మీద వెళ్లి ఆదర్శంగా నిలిచినట్టు మనం విన్నాం.చాన్నాళ్ల తరువాత ఇప్పుదు మళ్లీ అదే సీన్ రిపీట్ చేసి ఆదర్శంగా నిలిచారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు. పార్లమెంట్‌ సమావేశాల తొలి రోజు ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్‌కు సైకిల్‌పై చేరుకుని లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టారు అప్పలనాయుడు. ఢిల్లీలో తన అతిథి గృహం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు చేరుకున్నారు. సైకిల్‌ గుర్తుపై ఎంపీగా గెలిచిన విజయనగరం ఎంపీ మొదటి రోజు పార్లమెంట్‌లో అడుగు పెడుతున్న వేళ ఇలా సైకిల్‌పై దర్శనమిచ్చారు.

ఇటీవల విజయనగరం పార్లమెంట్ పరిధిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ సిగేసిన కలిశెట్టి అప్పలనాయుడు 15 లక్షల 68 వేల ఓట్లను సాధించారు.సమీప వైసీపీ అభ్యర్థిపై 2 లక్షల 29 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.అయినా ఓ సాధారణ వ్యక్తిలా ఇలా సైకిల్‌పై లోక్‌సభకు చేరుకున్నారు.పసుపు రంగు లాల్చీ, తెల్ల ధోవతి తో సంప్రదాయంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పార్లమెంట్ కు విచ్చేసారు.ఇలా చేయడం వెనుక ఏంటీఆర్ ను ఆదర్శంగా తీసుకున్నానని ఆయన చెప్పారు. ఇలా సైకిల్ పై వచ్చిన చాలామంది ఆదర్శంగా నిలిచారని,తాను కూడా వారి మార్గాన్ని అనుసరించారని వెల్లడించారు.

తొలిరోజు పార్లమెంట్‌లో లోక్‌సభ సభ్యుల ప్రమాణం స్వీకారం కొనసాగుతోంది. ముందుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా ప్రమాణం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణం చేశారు. ప్రధాని మోదీతో ప్రమాణస్వీకారాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కేంద్ర మంత్రులతో పాటు ఏపీ ఎంపీలు తెలంగాణ సభలో ప్రమాణం చేశారు.ఇవాళ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మాట్లాడారు. మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పనిచేస్తామని చెప్పారు. జనహితం కోసం సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, విపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version