18 ఓటీటీలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం

-

కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఓటీటీ ప్లాట్ఫామ్లపై నిషేధం విధించింది. అసభ్యకరమైన, అశ్లీలంతో కూడిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారనే కారణంతో పలు ఓటీటీ ప్లాట్‌ఫాంలు, సామాజిక మాధ్యమ ఖాతాలను తొలగించినట్లు కేంద్ర సర్కార్ తెలిపింది.

ఈ మేరకు 18 ఓటీటీ ప్లాట్‌ఫాంలు, 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు (గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఏడు, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి మూడు), 57 సోషల్ మీడియా అకౌంట్స్ () భారత్‌లో పని చేయకుండా బ్లాక్‌ చేసినట్లు వెల్లడించింది. సోషల్ మీడియా ఖాతాల్లో ఫేస్‌బుక్‌లో 12, ఇన్‌స్టాగ్రామ్‌లో 17, ఎక్స్‌లో 16, యూట్యూబ్‌లో 12 ఉన్నట్లు చెప్పింది.

‘ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం 2000’ కింద వాటిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపారు. సృజనాత్మక వ్యక్తీకరణ పేరిట అశ్లీలతను వ్యాప్తి చేయరాదని స్పష్టం చేశారు. తొలగించిన ఓటీటీలకు కోటికిపైగా డౌన్‌లోడ్స్‌ ఉన్నట్లు చెప్పారు. ఇవి సోషల్‌ మీడియా ద్వారా అశ్లీల కంటెంట్‌కు సంబంధించిన ట్రైలర్‌, దృశ్యాలు, వెబ్‌లింక్‌లను ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news