ఎన్నికల తర్వాత ‘డీప్‌ఫేక్‌’పై కొత్త రూల్స్‌: అశ్వినీ వైష్ణవ్‌

-

ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి ఒక్కరిని భయపెడుతున్న సమస్యలు డీప్ఫేక్, ఫేక్ న్యూస్. సమాజానికి, ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్న వీటి వ్యాప్తి కట్టడికి ఇప్పటికే కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. తాజాగా వీటిపై మరోసారి కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందించారు. ఫేక్ న్యూస్ను అరికట్టేందుకు తగిన పరిష్కారాలు కనుగొనాలని డిజిటల్‌ మాధ్యమాలను కోరినట్లు తెలిపారు. దీనిపై ఎన్నికల తర్వాత నిబంధనలను ఖరారు చేయనున్నట్లు చెప్పారు.

భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో నకిలీ సమాచార వ్యాప్తి సమాజానికి హాని చేస్తుందని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. అది దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, అందుకే, ఈ విషయంపై డిజిటల్‌ మాధ్యమాలతో నిర్మాణాత్మక చర్చలు జరుపుతున్నామని తెలిపారు. మరోవైపు డీప్‌ఫేక్‌ల వ్యాప్తిని అరికట్టేందుకు ఆ సంస్థలు కూడా నిరంతరం చర్యలు చేపడుతున్నాయని వెల్లడించారు. ఎన్నికల తర్వాత ఇందుకు అవసరమైన నిబంధనలను ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం చట్టంలో కొత్త నిబంధనలు లేదా అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version