జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం దిశగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ నేతృత్వంలో కొంతమంది JMM ఎమ్మెల్యేలు BJPలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీకి చంపై సోరేన్ & టీం బయల్దేరింది. ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ జైల్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంపై సోరేన్.
అయితే జార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో ఇండియా కూటమి 45 స్థానాల్లో గెలవగా.. 30 స్థానాల్లో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. ప్రస్తుతం అరుస్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం జార్ఖండ్ లో ఇండియా కూటమి అధికారంలో ఉండగా.. ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ ఉన్నారు. అయితే ఈ ఇండియా కూటమిలోని జార్ఖండ్ ముక్తి మొర్చా నుంచి 26 మంది ఎమ్మెల్యేలు.. 17 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆర్జేడీ, సిపిఐ ఎంఎల్ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు. అయితే మరో మూడు నెలల్లో జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు జారగనున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.