అభినందించిన నోళ్లే ఆడిపోసుకుంటాయి.. జాగ్రత్త మోడీ!

-

ప్రపంచం మొత్తాన్ని అల్లల్లాడించిన కోవిడ్ – 19 వైరస్ విషయంలో ఇంతకాలం భారత్ ను ప్రపంచ దేశాలు అభినందించాయి. మోడీ చాలా చాకచక్యంగా వ్యవహరించారని దేశప్రజలంతా మెచ్చుకున్నారు. మన్ కీ బాత్ అంటూ మోడీ కూడా ఆ ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు, సహలహాలూ ఇస్తూ వచ్చారు! అప్పుడంతా సక్రమంగానే ఉంది… లాక్ డౌన్ పేరుచెప్పి కరోనాను కట్టడిచేయడంలో నిజంగా భారత్ సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. కానీ… సడలింపులు భారీగా ఇస్తున్నారు అనే విమర్శకు తగ్గట్లుగా… కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తుంది! దీంతో… ఇంతకాలం అభినందిచిన వాళ్లే ఇప్పుడు మోడీని ఆడిపోసుకుంటున్నారనే కథనాలు వెలువడుతున్నాయి!

రెండు నెలలపాటు అందరినీ ఇంట్లోనే ఉంచి లాక్ డౌన్ విధిస్తేనే పూర్తిగా కట్టడి కానీ కరోనా… ఇప్పుడు సడలింపులు ఇచ్చి.. రైళ్లు, బస్సులు, విమానాలు నడుస్తున్న వేళ పంజా విసురుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. వేల సంఖ్యలో కేసులు, వందల మరణాలతో విరుచుకుపడుతుంది! దీంతో… దీనంతటికీ మోడీ ఇచ్చిన సడలింపులే కారణం అని కథనాలు వెలువడుతున్నాయి! ఇక ప్రజల అవగాహన గురించి అంటారా? ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బెత్తం వాడితే కాని కరోనా సంగతి వారికి గుర్తుకు రావడం లేదు! ఆమడదూరంలో పోలీసులు కనిపిస్తే తప్ప వారికి భౌతికదూరం, మాస్కులు మతికి తెచ్చుకోవడం లేదు!

భారత దేశంలో ఇప్పటిదాకా ఏ రోజు 8వేల కేసులు నమోదు కాలేదు. కానీ ఏకంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య శనివారం ఒక్కరోజే 8వేలకు పైగా నమోదయ్యాయి. ఆ ఒక్కరోజే 150 మందికి పైగా మరణించారు. దేశవ్యాప్తంగా మహారాష్ట్రలో ఏకంగా 3600కు పైగా కేసులు బయటపడ్డాయ్యి! తెలంగాణలో ఎప్పుడూ దాటని విధంగా 169 కేసుల సంఖ్య బయటపడ్డాయి! ఇది తెలంగాణ ప్రభుత్వానికి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ రకంగా విజృంభిస్తోన్న కరోనా… దేశంలో ఇప్పటిదాకా 1.73 లక్షల కేసులు నమోదు చేసింది!

ఇలా రోజు రోజుకీ గంట గంటకీ కేసుల సంఖ్య పెరిగిపోవడం.. వందల నుంచి వేలకు చేరడం.. మరణాల సంఖ్య కూడా పెరగడానికి కారణం మోడీ ప్రభుత్వం ఇచ్చిన సడలింపులే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాలు పునరాలోచించుకోని పక్షంలో పెను విధ్వంసం ఖాయమనే కామెంట్లూ బలంగా వినిపిస్తున్నాయి! మరి ఈ విషయాలను గమనించిన ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి… ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన విషయం!

Read more RELATED
Recommended to you

Latest news