ఛత్తీస్​గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

-

రాబోయే ఐదేళ్లకు తమ భవిష్యత్​ను రాసుకునేందుకు ఛత్తీస్‌గఢ్‌, మిజోరం ఓటర్లు రెడీ అయ్యారు. ఆ రాష్ట్రాల్లో ఇవాళ జరుగుతున్న పోలింగ్​లో పాల్గొంటూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఛత్తీస్​గఢ్​లోని 20 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. వీటిలో సమస్యాత్మక అంతగఢ్, భానుప్రతాపుర్, కంకేర్, కేష్‌కల్, కొండగావ్, నారాయణపుర్, దంతెవాడ, బీజాపూర్, కొంటా స్థానాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్​.. మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. మరోవైపు మిగతా నియోజకవర్గాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ జరుగుతుంది.

మరోవైపు మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 40 స్థానాల్లో ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. 174 మంది అభ్యర్థుల ఈ ఎన్నికల్లో తమ లక్ పరీక్షించుకుంటుండగా.. 8 లక్షలకు పైగా ఓటర్లు ఓటింగ్​లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో పోలింగ్​కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు చేపట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news