ఛత్తీస్​గఢ్​ సిత్రాలు.. 94 ఓట్లతో డిప్యూటీ సీఎం ఓటమి.. 16 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్ఖి గెలుపు

-

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు. డిప్యూటీ సీఎం సహా భూపేశ్ బఘేల్‌ సర్కారులో 9 మంది మంత్రులు ఓడిపోయారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి టీఎస్‌ సింగ్‌ దేవ్‌ అయితే, కేవలం వంద కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

ఈసీ తెలిపిన వివరాల ప్రకారం అంబికాపుర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సింగ్‌ దేవ్‌కు తాజా ఎన్నికల్లో 90,686 రాగా.. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాజేశ్‌ అగర్వాల్‌కు 90,780 ఓట్లు నమోదయ్యాయి. కేవలం 94 ఓట్ల తేడాతో సింగ్‌ దేవ్‌ ఓడిపోయారు. ఈయనతో పాటు హోంమంత్రి తమ్రాధ్వజ్‌ సాహు, వ్యవసాయ శాఖ మంత్రి రవీంద్ర చౌబే సహా మొత్తంగా 9 మంది మంత్రులు ఓటమి పాలయ్యారు.

మరోవైపు ఈ ఫలితాల్లో బీజేపీ నేత బ్రిజ్ మోహన్ అగర్వాల్ అత్యధిక మెజార్టీ (67,179)తో గెలుపొందగా.. కాంకేర్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆశారాం నేతమ్‌ తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థిపై కేవలం 16 ఓట్ల తేడాతో గెలిచారు. ఇలా ఈ ఎన్నికల్లో ఛత్తీసగఢ్​ ప్రజలు కాస్త విచిత్రమైన తీర్పును ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news