సనాతన ధర్మ వివాదంపై సీఎం యోగి రియాక్షన్.. రావణుడు, కంసుడి వల్లే కాలేదంటూ..

-

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ నేతలు స్పందించారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ వివాదం గురించి మాట్లాడారు. ‘‘రావణుడి అహంకారంతో సనాతన ధర్మం అంతం కాలేదు.. కంసుడి గర్జనకు సనాతన ధర్మం చలించలేదు.. బాబర్‌, ఔరంగజేబుల దురాగతాలకు సనాతన ధర్మం నశించలేదు. అలాంటి సనాతన ధర్మం ఇలాంటి అల్ప పరాన్న జీవుల వల్ల ఎలా అంతమవుతుంది’’ అని ఎక్స్‌ (ట్విటర్)లో పోస్టు చేశారు.

సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని మరోసారి ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. సనాతనాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదని.. పూర్తిగా తొలగించాలని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలను ఓ సామాజికవర్గంపై ఊచకోతకు ఉసిగొల్పినట్టు వక్రీకరించారని ఆరోపించారు. ‘తమిళనాడు ప్రొగ్రెసివ్‌ రైటర్స్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ గత శనివారం ‘సనాతన నిర్మూలన’ అనే ఇతివృత్తంతో సదస్సు నిర్వహించింది. దీనికి ఉదయనిధి స్టాలిన్‌ హాజరై ప్రసంగించారు.

Read more RELATED
Recommended to you

Latest news