యూపీలో మిస్టరీగా పులుల మరణాలు అధికారుల నిర్లక్ష్యంపై సీఎం యోగి ఆగ్రహం

-

పులి…. భారతదేశ జాతీయ జంతువు.అందుకే అంతరించిపోతున్న పులి జాతిని కాపాడలంటూ ప్రధాని నరేంద్ర మోడీ చాలాసార్లు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పులుల సంరక్షణకు చర్యలు తీసుకున్నాయి. అయితే ఇటీవల ఉత్తర ప్రదేశ్లో పులుల మరణాలు సంచలనంగా మారాయి దుధ్వా టైగర్ రిజర్వ్‌ పరిధిలోని కిషన్‌పూర్ సెంచరీలో ఉన్న మైలానీ శ్రేణిలో మరో పులి కళేబరం కనిపించింది. ఇక్కడ వారాం రోజుల క్రితం ఒక పులి చనిపోయింది.అంతలోనే మరో పులి మృత్యువాత పడటం సంచలనమైంది.

తరుచుగా పులులు చనిపోతుండటంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీరియస్ అయ్యారు.ముఖ్యమంత్రి పలువురు అధికారులతో వన్యప్రాణి శాఖ సహాయ మంత్రితో కూడిన ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసి, వారిని దుధ్వా నేషనల్ పార్క్‌కు పంపారు. దీంతో పాటు ఈడీ వ్యవహారానికి సంబంధించిన రిపోర్టు కూడా రావడంతో పార్కు యంత్రాంగంలో కలకలం రేగింది. దుధ్వా నేషనల్‌ పార్క్‌ డిప్యూటీ డైరెక్టర్‌ టి రంగరాజు, ఫీల్డ్‌ డైరెక్టర్‌ వి ప్రభాకరన్‌ అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా, పులి శరీరం సగం నీళ్లలో, మిగిలిన సగం నేలపై పడి ఉండటాన్ని గమనించారు.

పులి వయస్సు 6-7 సంవత్సరాలు:

చనిపోయిన పులి మగదని, దాని వయస్సు 6-7 సంవత్సరాలు ఉంటుందని డీటీఆర్ డిప్యూటీ డైరెక్టర్ టి.రంగరాజు తెలిపారు. చనిపోయిన పులి తలపై గాయం గుర్తులు ఉన్నాయని, పరస్పర ఘర్షణలో పులి చనిపోయినట్లు ఈ గాయాలు సూచిస్తున్నాయని ఆయన అన్నారు. త్వరితగతిన, పులి మృతదేహాన్ని సామాన్యులకు దూరంగా ఉంచి, పోస్ట్‌మార్టం నిమిత్తం బరేలిలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సెంటర్ తరలించారు.

పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాతే మరణానికి గల కారణాలు తెలుస్తాయి. పోస్టుమార్టం నివేదికలో పులి మృతికి గల కారణాలు వెల్లడవుతాయని డిప్యూటీ డైరెక్టర్ టి.రంగరాజు తెలిపారు. అయితే ఆరు రోజుల్లోనే ఈ ప్రాంతంలో రెండు పులులు మృతి చెందడం పార్కు పాలకవర్గంలో తీవ్ర భయాందోళనకు గురి చేసింది. మరోవైపు పులుల మృతితో వన్యప్రాణుల ప్రేమికులు షాక్‌కు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై అటు ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్ అయ్యారు. అనుమానాస్పద పరిస్థితుల్లో వన్యప్రాణుల మరణాలపై అటవీశాఖ నిరంతరంగా విచారణ జరుపుతుందేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news