స్పై యాక్షన్ త్రిల్లర్ గా మాస్ మహారాజా “ఈగల్”.. టైటిల్ టీజర్ అదిరిందిగా..!

-

మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. యంగ్ హీరోల కన్నా స్పీడ్ గా మూవీలను కంప్లీట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు రవితేజ. ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు అనే సినిమాతో రవితేజ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినట్టు తెలుస్తుంది. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు రవితేజ.

ఇటీవల తన కొత్త సినిమాని టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనితో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వచ్చిన ధమాకా.. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రవితేజ.

తాజాగా ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేసింది మూవీ యూనిట్. ఈ సినిమాకి ముందు నుంచి అనుకున్నట్టుగానే “ఈగల్” అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా రవితేజ కెరియర్ లో 73వ సినిమాగా రాబోతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. స్పై యాక్షన్ త్రిల్లర్ గా రాబోతున్న ఈ టైటిల్ టీజర్ వీడియో అదిరిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news