ట్రైనీ IAS పూజపై విచారణకు కమిటీ

-

గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేద్కర్‌ సంబంధించి మరికొన్ని వివాదాలు తెరపైకి వచ్చాయి. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష పాసయ్యేందుకు ఆమె పలు నకిలీ సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. వాటిని నిర్ధరించే వైద్య పరీక్షలకు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. అధికార దుర్వినియోగానికి సంబంధించి అనేక ఆరోపణలు రావటంతో ఆమెపై బదిలీ వేటువేశారు.  ఈ నేపథ్యంలో ఈ వివాదాస్పద ట్రెయినీ అభ్యర్థిత్వంపై విచారణ జరిపేందుకు కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఒక సభ్యుడితో ఏర్పాటు చేసిన ఈ కమిటీ రెండు వారాల్లో నివేదిక ఇవ్వనుంది.

తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు యూపీఎస్సీకి సమర్పించిన అఫిడవిట్‌లో పూజ పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కమిటీ నిజనిర్ధారణ చేయనుంది. పుణెలో బ్యూరోక్రాట్‌గా తన పదవిని దుర్వినియోగం చేయడం, ఇతర డిమాండ్లతో ఖేద్కర్‌ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆమె తన ప్రైవేటు ఆడీ కారుకు సైరన్‌, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్‌, వీఐపీ నంబర్‌ ప్లేట్లను అనుమతి లేకుండా వాడినట్లు ఆరోపణలు రావడంతో ఆమెను మహారాష్ట్ర ప్రభుత్వం వాసిమ్‌కు బదిలీ చేసింది. వాస్తవానికి ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే జూనియర్‌ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు.

Read more RELATED
Recommended to you

Latest news