పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక పురోగతికి పునాదులు వేశారని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పీవీ పట్ల కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు చేపట్టిందన్నారు. పీవీ నరసింహారావు గారు మరణించాక ఢిల్లీలో అంతిమ సంస్కారాలు చేయకుండా హైదరాబాద్ పంపించి అవమానించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఇవాళ భారతరత్న అవార్డు రావడం దేశానికి గర్వకారణం అన్నారు.
1991-96 భారత ప్రధానిగా కొనసాగిన పీవీ దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దారని పేర్కొన్నారు. 1962, 67 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కొనసాగిన పీవీ 1971లో ఉమ్మడి ముఖ్యమంత్రిగా పనిచేశారు పీవీ. కాంగ్రెస్ పార్టీ పీవీని ఎన్నోసార్లు అవమానానికి గురిచేసింది అన్నారు. పీవీ నరసింహారావు భారతరత్న అవార్డు ఇవ్వడం తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ విషయం అన్నారు. విదేశీ విధానంలో అనేక మార్కులు తీసుకొచ్చారు పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. జాతీయ వాదిగా పీవీ నరసింహారావు చేసిన సేవలకు ఈనాడు బిజెపి ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇచ్చిందన్నారు.
పీవీతో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ ఒకేసారి ముగ్గురికి బీజేపీ ప్రభుత్వం భారత రత్న అవార్డులను ప్రకటించడం విశేషం. ఒకే ఏడాది ఐదుగురికి భారతరత్న అవార్డులను ఇవ్వడం గొప్ప విషయమన్నారు.