నోట్ల రద్దుపై సుప్రీం తీర్పు.. చిదంబరం రియాక్షన్ ఏంటంటే..?

-

పెద్ద నోట్ల రద్దుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం స్వాగతించారు. ముఖ్యంగా నోట్ల రద్దు లక్ష్యం నెరవేరిందా అనే అంశంపై సుప్రీం ధర్మాసనం స్పష్టత ఇచ్చిందని తెలిపారు. మెజారిటీ ధర్మాసనం దీనికి మద్దతు పలికినా.. మైనార్టీ తీర్పు మాత్రం ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని అన్నారు. నోట్ల రద్దు చట్టవిరుద్ధమంటూ ధర్మాసనంలోని జస్టిస్‌ నాగరత్న చేసిన వ్యాఖ్యలపై చిదంబరం స్పందించారు.

‘నోట్ల రద్దుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. అయినా ఈ నిర్ణయాన్ని అందరూ సమర్థించారా, ప్రభుత్వం వాటి లక్ష్యాలను సాధించిందా అనే అంశాన్ని ప్రస్తావించడం అవసరం. లక్ష్యాలను సాధించే అంశంపై సుప్రీం కోర్టులోని మెజారిటీ ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. ఇదే సమయంలో నోట్ల రద్దు చట్టవిరుద్ధ మార్గంలో జరిగినట్లు ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి పేర్కొనడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిది’ అని చిదంబరం అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version