40ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి 12కోట్ల ఓట్లు.. మరి బీజేపీకి ఎన్నంటే?

-

లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్​డీఏ కూటమికి మెజార్టీ సీట్లు దక్కడంతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్​డీఏ, ఇండియా కూటమి మధ్య పోరు హోరాహోరీగా జరిగింది. ఎన్డీఏపై ఇండియా కూటమి విజయం సాధించలేకపోయినా ఈ ఎన్నికల్లో ఆ కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఒక రికార్టు సాధించింది. అదేంటంటే?

1984 లోక్​సభ ఎన్నికల తర్వాత మళ్లీ ఈ లోక్​సభ పోరులో కాంగ్రెస్ పార్టీ 12 కోట్ల ఓట్లను సాధించింది. 40 ఏళ్ల తర్వాత హస్తం పార్టీ 12 కోట్లకు పైగా ఓట్లను పొంది రికార్డు క్రియేట్ చేసింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన ఎన్నికల్లో భారీగా ఓట్లు సాధించిన హస్తం పార్టీ ఆ తర్వాత అంతగా రాణించలేకపోయింది. మళ్లీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటింది. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, దేశవ్యాప్తంగా జరిగిన 2024 లోక్ సభ ఎన్నికల్లో 64.20 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో కాంగ్రెస్ 13.63 కోట్లకు పైగా ఓట్లను సాధించింది. బీజేపీ 23.45 కోట్ల ఓట్లను పొందింది.

Read more RELATED
Recommended to you

Latest news