హామీలపై కర్ణాటక సర్కార్ తొలి అడుగు.. మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం పక్కా

-

ఇటీవలే కొలువుదీరిన కర్ణాటక సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కసరత్తు చేస్తోంది. కన్నడ నాట ఎన్నికల్లో హస్తం నేతలు ఐదు ప్రధాన హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలుపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఈ హామీలను నెరవేర్చేందుకు ఏటా దాదాపు రూ.50వేల కోట్లు ఖర్చవుతుండటంతో ప్రభుత్వం ఎలా అడుగులు వేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలుచేయడంలో ఎలాంటి షరతులూ పెట్టబోమని స్పష్టంచే శారు.  ‘‘బస్సు ప్రయాణం మహిళలకు ఉచితం. వర్కింగ్‌ విమెనా, ఇంకెవరా తదితర అంశాలతో సంబంధంలేదు. బస్సులో ప్రయాణం చేసే మహిళలందరికీ ఉచితమే’’ అని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా 3.5కోట్ల మందికి పైగా మహిళలు ఉన్నారు కదా.. అని విలేకర్లు ప్రశ్నించగా..  వారందరూ బస్సులో ప్రయాణం చేయాలనుకుంటే అందరికీ ఉచితమేనని మంత్రి సమాధానం చెప్పారు.  అన్ని ప్రభుత్వ బస్సు సర్వీసుల్లోనూ ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తారా? అని విలేకర్లు అడగ్గా.. ఈ అంశంపై కేబినెట్‌ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news