ఆయన హామీతో.. గంగానదిలో పతకాలు పడేయటంపై వెనక్కి తగ్గిన రెజ్లర్లు

-

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్​కు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా రెజర్లు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమకు న్యాయం చేయకపోవడం.. కనీసం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై రెజ్లర్లు విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రెజ్లర్లు తమ పతకాలను హరిద్వార్ గంగానదిలో పడేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడా నిర్ణయంపై వెనక్కి తగ్గారు.

ఈ నేపథ్యంలో హరిద్వార్‌లోని గంగానది ఒడ్డున హైడ్రామా కొనసాగింది. రైతు సంఘాల నేత నరేశ్‌ టికాయత్‌ హరిద్వార్‌కు చేరుకుని రెజ్లర్లను సముదాయించారు. వారి వద్ద నుంచి పతకాలను టికాయత్‌ తీసుకున్నారు. ఐదురోజులు వేచి ఉండాలని రెజ్లర్లకు టికాయత్‌ సూచించారు. ప్రభుత్వానికి రైతు సంఘాల నేతలు ఐదు రోజులు గడువిచ్చారు. అలా రైతు సంఘ నేతల సూచనలతో రెజర్లు ఆందోళన విరమించారు. నరేశ్‌ టికాయత్‌తో చర్చల అనంతరం రెజ్లర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అంతకుముందు గంగానదిలో మెడల్స్‌ను పారవేసిన తర్వాత రెజ్లర్లు ఇండియా గేట్‌కు చేరుకుంటామని ప్రకటించారు. అయితే వారిని అక్కడ నిరసనలు చేసేందుకు అనుమతి ఇవ్వబోమని పోలీసులు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news