రాహుల్‌ గాంధీ హత్యకు కుట్రలు..ఇందిరా చంపినట్లేనంటూ ఫిర్యాదు !

-

రాహుల్‌ గాంధీ హత్యకు కుట్రలు చేస్తున్నారని…పోలీసులకు కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. బిజేపి నేతలపై కాంగ్రెస్ నేత అజయ్ మెకన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ని హతమారుస్తామని, భౌతిక దాడులకు పాల్పడతామంటూ బిజేపి నేతల హెచ్చరికలు జారీ చేశారని.. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ లో బిజేపి నేతలపై ఫిర్యాదు చేశారు.

rahul gandhi indhira gandhi

నీ విమర్శలు ఆపాలి. జాగ్రత్తగా ఉండు….లేకపోతే, మీనాన్నకు ఏమైందో అదే అవుతుందంటూ రాహుల్ గాంధీ కి బెదిరింపులు వచ్చాయట. బిజేపి తో పొత్తులో ఉన్న ఒక పార్టీ కి చెందిన నాయకుడు రాహుల్ గాంధీ నాలుకను కోసి తెస్తే 11 లక్షల రూపాయాలు ఇస్తామని ప్రకటించాడని అజయ్ మెకన్ ఆరోపణలు చేశారు. రాజకీయాలు ఈ స్థాయికి దిగజారాయని విమర్శించిన అజయ్ మెకన్…రాహుల్ గాందీ మైనారిటీలు, దళితులు, వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడడం ఈ పార్టీ ల నేతలకు ఇష్టంగాలేదు…కష్టంగా ఉందని తెలిపారు. అయినా.., చంపేస్తామంటూ చేసే బెదరింపులకు భయపడేది లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version