చిన్నారులపై అఘాయిత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పెద్దలే కాకుండా మైనర్లు కూడా చిన్నారులపై దారుణాలకు ఒడిగడుతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆడపిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సంగారెడ్డిలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. టీవీ చూద్దామని ఇంట్లోకి పిలిచి ఏడేళ్ల చిన్నారిపై ఓ మైనర్ లైంగికదాడికి యత్నించాడు.
పోలీసుల కథనం ప్రకారం.. రామచంద్రపురం పీఎస్ పరిధిలో ఉండే ఓ మైనర్(17) తన పొరుగింట్లో ఉండే ఏడేళ్ల పాపను టీవీ చూద్దాం రా అని పిలిచి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.అనంతరం ఆ పాపను ఇంట్లో వదిలేశాడు. బయటకు వెళ్లిన తల్లి ఇంటికి వచ్చే చూసే సరికి పాప స్పృహ కోల్పోయి ఉంది. పాపను పరిశీలించిన తల్లి రక్తస్రావం అయినట్లు గుర్తించి ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు పాపపై లైంగికదాడి జరిగినట్లు గుర్తించారు. అసలు విషయంపై ఆరా తీయగా ఇంటి పక్కన ఉండే మైనర్ బాలుడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుసుకున్న బాధిత పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదులో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.