అనుమానం ఏడుగురి ప్రాణం తీసింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందడం మరింత విషాదం. కరోనా సోకిందనే అనుమానంతో వారంతా హోమియోపతి మందును వాడటమే వారికి శాపంగా మారింది. ఒకరి తర్వాత ఒకరు అర్ధరాత్రి నుంచి తెల్లవారే లోపే శవాలుగా మారారు. ఈ దారుణ ఘటన బిలాస్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
సిర్గిట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం నివాసముంటోంది. ఇందులో కమరలేష్ ధూరి(32), అక్షి ధురి(21), రాజేశ్ ధూరి(21), సమ్రూ ధూరి(25), ఖేమ్ చంద్ ధూరి(40), కైలాష్ ధూరి(50), దీపక్ ధూరి(30) వీరందరికీ కరోనా సోకిందనే అనుమానంతో.. ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లగా. ఆయన వీరందరికీ ద్రోసెరా 30 అనే హోమియో పతి మందును వాడమని ఇచ్చాడు.
వారంతా మంగళవారం రాత్రి ఆ మందును వేసుకున్నారు. అయితే ఆ మందు వికటించి ఇందులో ఐదుగురు అర్ధరాత్రి చనిపోగా.. మిగతా నలుగురు బుధవారం తెల్లవారుజామున చనిపోయారు. వీరంతా నిద్రలోనే కన్నుమూసినట్టు సమాచారం. దీంతో సదరు డాక్టర్ గ్రామం నుంచి పారిపోయాడు. కాగా కుటుంబంలో ఏడుగురు చనిపోవడంతో.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.