మీ ఫోన్‌ నంబర్‌ మార్చారా? అయితే, మీకు ఇబ్బందులే!

-

ఒకవేళ మీరు మీ ఫోన్‌ నంబర్‌ మార్చినట్లయితే, మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్స్‌ ఉంది. ఆ పాత నంబర్‌ను మీరు వాడకపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

అసలు చాలా మంది వారు ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌ నంబర్‌ మొదటిది కాదు అనే అంటారు. వారు తీసుకున్న ఫోన్‌ నంబర్‌ కొన్ని కారణాల వల్ల వాడలేకపోతాం. కొందరైతే పాత నంబర్‌ను కొత్త నెట్‌వర్క్‌లకు మార్చుకొని వాడుకుంటుంటారు. గతంలో ఈ అవకాశం లేనప్పుడు పాత సిమ్‌ను పక్కన పడేసేవాళ్లం. అయితే అలా మీరు వదిలేసిన నంబర్లు లేనిపోని ఇబ్బందులు తెస్తున్నాయి అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే ఆ నంబర్ల ద్వారా మీ వ్యక్తిగత సమాచారం వేరొకరికి చేరే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కొన్ని నెలలు పాటు మొబైల్‌ నంబర్‌ వాడకపోతే, దాన్ని సంబంధిత నెట్‌వర్క్‌ సంస్థలు డీయాక్టివేట్‌ చేసి, వేరొకరికి ఇస్తుంటాయి. దీంతో కొంతమంది పాత నంబర్లు… కొన్నాళ్లకు ఇతరులకు వెళ్లిపోతున్నాయి. దీంతో పాత వినియోగదారులకు చెందిన మెసేజ్‌లు, ఓటీపీలు, వ్యక్తిగత సందేశాలు కొత్త వ్యక్తులకు వెళ్తున్నాయి.
దీనివల్ల కొత్త, పాత వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ పరిశోధనలో ఈ విషయాలు వెల్లడించారు. హ్యకర్లు,వినియోగదారుల వ్యక్తిగత సమాచారం సేకరించేలా ఈ నంబర్లకు ఫిషింగ్‌ లింక్‌ పంపొచ్చు. అంతేకాకుండా, నంబరుతో సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ పాస్‌వర్డ్‌లు రిసెట్‌ చేయొచ్చు. అందుకే మీరు ఏదైనా సబస్క్రైబ్‌ చేసుకుంగే పాత నంబర్‌పై వెంటనే అన్‌సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాలి. లేదంటే పాత సబ్‌స్క్రిప్షన్లు కొత్త వ్యక్తికి వర్తించకుండా చేయాలి. అంతకంటే ముందు పాత నంబరు వదులుకోగానే వినియోగదారులు ఆ నంబరు ఉన్న చోట తమ కొత్త నంబరు ఇవ్వడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version