భార‌త్‌లో క‌రోనా తాజా లెక్క‌లివే..

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతోంది. కొత్త‌గా 83,809 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,926,914కు చేరుకుంది. ఒక్క‌రోజులోనే 1,054మంది క‌రోనాతో మ‌ర‌ణించ‌గా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 80,827కు చేరుకుంది. ప్ర‌స్తుతం 973,175 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. 37,80,107మంది వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. మ‌హారాష్ట్ర‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడులో కేసుల సంఖ్య భారీగా న‌మోదు అవుతోంది. మ‌హారాష్ట్ర‌లో 1,077,374, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 575,079, త‌మిళ‌నాడులో 491,571, క‌ర్నాట‌క‌లో 467,689, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 317,195 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 29,433,091 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 21,264,646మంది కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 932,390మంది మ‌ర‌ణించారు. అత్య‌ధికంగా అమెరికాలో 6,748,618 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. బ్రెజిల్‌లో 4,349,544కేసులు న‌మోదు అయ్యాయి.