కొవాగ్జిన్ మ‌రో ఘ‌న‌త‌.. యూనివ‌ర్సల్ వ్యాక్సిన్‌గా గుర్తింపు

-

భార‌త్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ మ‌రో ఘ‌న‌త సాధించింది. యూనివ‌ర్సల్ వ్యాక్సిన్ గా కొవాగ్జిన్ టీకా గుర్తింపు తెచ్చుకుంది. ఈ విష‌యాన్ని భార‌త్ బ‌యోటెక్ ప్ర‌తినిధులు అధికారింగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం కొవాగ్జిన్ టీకాను చిన్నారులు, వృద్ధులు ఇలా అంద‌రికీ పంపిణీ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 18 ఏళ్ల పై బ‌డిన వారికి పంపిణీ చేసిన ఈ వ్యాక్సిన్.. ప్ర‌స్తుతం 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న వారికి కొవాగ్జిన్ టీకానే పంపిణీ చేస్తున్నారు.

అలాగే బూస్ట‌ర్ డోసు గానూ కొవాగ్జిన్ టీకా ను పంపిణీ చేస్తున్నారు. అయితే ఇటీవ‌ల భార‌త్ బ‌యోటెక్ త‌మ కొవాగ్జిన్ వ్యాక్సిన్ కు పూర్తి స్థాయి అనుమ‌తులు ఇవ్వాల‌ని డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా ను లేఖ ద్వారా కోరింది. అయితే డీజీసీఐ కి లేఖ రాసిన కొద్ది రోజుల్లోనే కొవాగ్జిన్ కు యూనివ‌ర్స‌ల్ వ్యాక్సిన్ గా గుర్తింపు వ‌చ్చింది. అయితే దీని పై స్పందించిన భార‌త్ బ‌యోటెక్ ప్ర‌తినిధులు.. కొవాగ్జిన్ ను గ్లోబ‌ల్ వ్యాక్సిన్ గా అభివృద్ధి చేయాల‌న్న త‌మ క‌ళ నెర‌వేరింద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news