కోవిడ్ 19 ఉంటే చ‌ర్మంపై ఈ విధ‌మైన మార్పులు వ‌స్తాయి..!

-

క‌రోనా వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ సోకిన వారికి ద‌గ్గు, తీవ్ర‌మైన జ్వ‌రం, రుచి, వాస‌న తెలియ‌క‌పోవ‌డం వంటి కామ‌న్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే కోవిడ్ ఇన్‌ఫెక్ష‌న్ ఉన్న‌వారి చ‌ర్మంపై ప‌లు విధాలైన మార్పులు వ‌స్తాయ‌ని కూడా సైంటిస్టులు తేల్చారు. ప‌లువురు కోవిడ్ బాధితులను క్షుణ్ణంగా ప‌రిశీలించిన అనంత‌రం సైంటిస్టులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

కోవిడ్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చిన వారిలో చేతి వేళ్లు, కాలి వేళ్ల‌పై చ‌ర్మం కొన్ని చోట్ల కందిపోయిన‌ట్లు ఎర్ర‌గా, న‌ల్ల‌గా మారుతుంది. కొంద‌రికి బొబ్బ‌లు కూడా వ‌స్తాయి. 8 దేశాల్లో 318 మంది రోగుల‌కు ఇదే విధంగా చ‌ర్మం మారింద‌ని సైంటిస్టులు గుర్తించారు.

కోవిడ్ సోకిన వారిలో కొంద‌రికి కాళ్ల‌పై వేడి బొబ్బ‌ల మాదిరిగా క‌నిపిస్తాయి.

క‌రోనా సోకిన కొంద‌రిలో కాలి వేళ్లు, మ‌డ‌మ‌లపై చ‌ర్మం కందిపోయి ఎర్ర‌గా మారుతుంది. అక్క‌డంతా ద‌ద్దుర్లు వ‌స్తాయి. ఈ విధ‌మైన ల‌క్ష‌ణాలను కూడా కొంద‌రు కోవిడ్ పేషెంట్ల‌లో గ‌మ‌నించారు.

ఇక క‌రోనా సోకిన కొంద‌రిలో చ‌ర్మం కందిపోదు. కానీ ద‌ద్దుర్లు మాత్రం ఏర్ప‌డుతాయి.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు ప్ర‌ముఖ హాస్పిట‌ల్స్, రీసెర్చి ఇనిస్టిట్యూట్‌ల‌కు చెందిన సైంటిస్టులు ఈ ల‌క్ష‌ణాల‌ను ప‌లువురు కోవిడ్ పేషెంట్ల‌లో గుర్తించారు. క‌నుక ఎవ‌రికైనా స‌రే పైన తెలిపిన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌రాద‌ని సైంటిస్టులు హెచ్చ‌రించారు. వీలైనంత త్వ‌ర‌గా చ‌ర్మ వ్యాధుల నిపుణుల‌ను క‌ల‌వాల‌ని, వైద్య ప‌రీక్ష‌లు.. ముఖ్యంగా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. లేదంటే స‌మ‌స్య తీవ్ర‌త‌రం అయ్యి ప్రాణాపాయ ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయ‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version