ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్-29 యుద్ధవిమానం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ విమానంలోని ఇద్దరూ ఫైలెట్స్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. కూలీ ముందే ఇద్దరూ ఫైలెట్లు అలెర్ట్ అయ్యారు. ఆటోమేటిడ్ సిస్టమ్ ఎజెక్ట్ ద్వారా వారిద్దరూ క్షేమంగా బయటపడ్డారు.
పంజాబ్ రాష్ట్రం లోని అధంపూర్ నుంచి యూపీలోని ఆగ్రా వెళ్తుండగా.. ఆగ్రా సమీపంలో భారీ మంటలు ఎగిసి పడి పంట పొలాల్లో మిగ్ -29 యుద్ద పైలెట్ కూలింది. ఈ ప్రమాదం జరగడానికి కారణాలు మాత్రం ఇంకా తెలియడం లేదు. భారీగా మంటలు ఎగిసి పడటంతో స్థానికంగా ఉన్న రైతులు, ప్రజలు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫొన్ల ద్వారా స్థానికులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ అంతా గుంపులు గుంపులుగా గుమికూడారు. ముఖ్యంగా పైలెట్లు జెట్ నేలకూలుతుందని గ్రహించిన వెంటనే చాకచక్యంగా అందులో నుంచి కిందకు దూకేశారు. లేదంటే వారు కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశముడేది.