గుజరాత్ ఎన్నికలలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా ఘనవిజయం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి చారిత్రాత్మక విజయాన్ని అందుకునే దిశగా సాగుతుంది. దాదాపు 157 సీట్లలో పూర్తి ఆదిక్యంతో దూసుకుపోతోంది. మొత్తం 182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో బిజెపి 97 స్థానాలలో విజయకేతనం ఎగురవేసి, మరో 58 చోట్ల ముందంజలో కొనసాగుతుంది. ఇక ఈ ఎన్నికలలో జూమ్ నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.. రివాబా జడేజా ఘనవిజయం సాధించింది.

ఆమె తన ప్రత్యర్థి పై 61 వేలకు పైగా భారీ మెజారిటీ సాధించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. క్షత్రియ ప్రభాల్యం ఉన్న ఈ సెగ్మెంట్లో రవీంద్ర జడేజా భార్య భారీ మెజారిటీతో గెలుపొందింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 2012లో కాంగ్రెస్ టికెట్ పై ధర్మేంద్ర సింగ్ జడేజా గెలుపొందగా.. 2017 లో ఆయన పార్టీ మారి బిజెపి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక ఈసారి బిజెపి టికెట్ పై రవీంద్ర జడేజా భార్య రివాబా గెలుపొందారు.