సాగు చట్టాలు పూర్తి గా ర‌ద్దు.. ఆమోదం తెలిపిన రాష్ట్రప‌తి

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకు వ‌చ్చిన మూడు సాగు చ‌ట్టాలు ర‌ద్దు ప్ర‌క్రియా నేటి తో పూర్తి గా ముగిసింది. తాజా గా వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు బిల్లు కు రాష్ట్రప‌తి రామ్ నాథ్ కొవింద్ ఆమోద ముద్ర వేశాడు. దీంతో మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాలు ఇక నుంచి భార‌త దేశంలో లేవు. అయితే వ్య‌వసాయ చట్టాల రద్దు బిల్లు నవంబర్ 29న పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌వేశ పెట్టారు. అదే రోజు వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు బిల్లు కు ఉభ‌య స‌భలు ఆమోదం తెలిపాయి.

 

దీంతో ఆ బిల్లు రాష్ట్ర ప‌తి వ‌ద్ద కు చేరింది. ఈ బిల్లు పై రాష్ట్ర ప‌తి రామ్ నాథ్ కొవింద్ నేడు నిర్ణ‌యం తీసుకున్నాడు. అయితే గ‌త ఏడాది కేంద్ర ప్ర‌భుత్వం ఈ మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను తీసుకు వ‌చ్చింది. ఈ చ‌ట్టాలు వ‌చ్చిన నాటి నుంచి దేశ వ్యాప్తం గా రైతులు ఆందోళ‌న లు చేస్తున్నారు. ముఖ్యం గా హ‌ర్యాన‌, పంజాబ్, ఉత్త‌ర ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాల రైతులు ఏడాది గా ఢిల్లీ స‌రి హ‌ద్దు ల‌లో నే మాకం వేసి ఆందోళ‌న చేశారు. 700 మంది రైతులు మృతి చెందినా.. రైతులు వెన‌క్కి త‌గ్గ‌లేదు. చివ‌రి గా ప్ర‌ధాని మోడీ సాగు చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని ప్ర‌క‌టించారు.