పొగమంచుతో ముంచుకొస్తున్న ప్రమాదం.. దిల్లీ నుంచి గల్లీ వరకూ డేంజరే..!!

-

దేశానికే కాదు..కాల్యుషానికి కూడా దిల్లీయో రాజధాని.. నెంబర్‌ వన్‌ పొల్యూషన్‌ సిటీ..! ప్రస్తుతం దిల్లీలో అంతా పొగమంచు కమ్ముకుంది. తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా అక్కడి ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఢిల్లీ AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగా దెబ్బతింది. కేవలం ఢిల్లీలోనే కాదు హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరాల్లో ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వాయుకాలుష్యం కారణంగా ఏర్పడే దట్టమైన పొగమంచు కారణంగా కళ్లు, ఊపిరితిత్తులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదు. దీనికి తోడు చలికాలంలో విపరీతమైన పొగమంచు ఉంటుంది. అందుకే ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ పరిస్థితులో కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం వల్ల కొంతలో కొంతైన మెరుగ్గా ఉంటుంది.

పొగ మన శరీరానికి చాలా హానికరం. పొగమంచు వల్ల మన శరీరంలోని అంతర్గత అవయవాలకు ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈ కాలుష్యం మన శ్వాస ద్వారా శరీరంలోకి వెళ్లినప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురై.. గొంతు నొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు తలెత్తుతాయి. పొడి దగ్గు రావడం, శ్వాస సరిగా అందకపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆస్తమా లాంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న వాతావరణం పరిస్థితులను బట్టి దగ్గుతో కూడిన తెమడా రావడం, శ్వాస సరిగా అందకపోవడం, చలి తీవ్రత పెరగడంతో తుమ్ములు రావడం, ముక్కు నుంచి నీరు కారడం, గొంతు నొప్పి వంటివి సహజంగా కనిపిస్తాయి.

ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఆవిరిని తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. నిరంతరం ఆవిరి తీసుకోవడం వల్ల శ్వాసకోశ వ్యవస్థలో ఎలాంటి కఫం, ధూళి చేరే ప్రమాదం ఉండదు. అలా అని అదేదో ఉద్యమం లెక్క ఆవిరి తీసుకోకూడదు. రోజుకు ఒకటి రెండు సార్లు చాలు.. అలాగే ఆవిరి పట్టేటప్పుడు ఒక ముక్కుతో గాలి బాగా పీల్చుకుని ఇంకో ముక్కుతో వదలాలి.. ఉన్నది ఒక్కటే ముక్కుగా అంటారేమో.. ఒక ముక్కు రంధ్రంతో అని అర్థం..!!

కాలుష్యం దుష్ప్రభవాలను తగ్గించడానికి ప్రతిరోజూ ఖాళీ కడుపుతో బెల్లం తినాలి. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటితో బెల్లం తినడం వల్ల శరీరంలోని విషతుల్య పదర్థాలు బయటకు వెళ్లిపోతాయి. బెల్లంలో సాధారణంగా వ్యర్థాలు ఉంటాయి. కాబట్టి కాస్త ఖరీదైనదే ఎంచుకోండి.!

Read more RELATED
Recommended to you

Latest news