David Warner : చెన్నై వరదలపై డేవిడ్ వార్నర్ ఆందోళన

-

చెన్నైను అతలాకుతలం చేస్తున్న వరదలపై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై వరద బీభత్సం తాలూకు వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ నగరంలో అందరూ సురక్షితంగా ఉండాలని, వీలైతే ఎత్తులో ఉండే ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తిచేశారు.

David Warner Posts Heartfelt Post For Chennai Flood Victims
David Warner Posts Heartfelt Post For Chennai Flood Victims

సాయం చేసే స్థితిలో ఉన్నవారు అవసరమైన వారికి అండగా నిలవాలని కోరారు. వార్నర్ పోస్ట్ కు అనేకమంది కృతజ్ఞతలు చెబుతూ రిప్లైలు ఇస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ జారీ చేయగా…. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, భూపాలపల్లి, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news