Deepak Chahar : సౌతాఫ్రికా టూర్‌కు చాహర్ దూరం కానున్నారు. టీమ్ ఇండియా పేసర్ దీపక్ చాహార్ తండ్రి లోకేంద్ర సింగ్ చాహార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన దక్షిణాఫ్రికా పర్యటనకు దూరంగా ఉండాలని చాహార్ భావించారు.

తన తండ్రి బాగోగులు దగ్గరుండి చూసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆసీస్ తో జరిగిన ఐదో టి20కి ముందే చాహార్ తండ్రి అనారోగ్యానికి గురవడంతో ఇంటికి వెళ్లిపోయారు. దీంతో చివరి మ్యాచ్ లో కూడా ఆయన ఆడలేకపోయారు.