నన్ను అరెస్టు చేయడానికే ఈడీ విచారణకు పిలుస్తోంది: దిల్లీ సీఎం కేజ్రీవాల్‌

-

తనను అరెస్టు చేయడానికే ఈడీ విచారణకు పిలుస్తోందని ఆప్ అధినేత, దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ ఆరోపించారు. వాస్తవానికి మద్యం విధానంలో ఎలాంటి అవినీతి లేదని ఆయన స్పష్టం చేశారు. నిజాయతీ నా పెద్ద ఆస్తి.. దానిని దోచుకోవాలని బీజేపీ చూస్తోంది అని దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ అన్నారు. ఈడీ సమన్లు చట్టవ్యతిరేకమని తమ లాయర్లు చెప్పారని తెలిపారు. తనను విచారించడం బీజేపీ ముఖ్య లక్ష్యం కాదన్న సీఎం కేజ్రీవాల్‌.. తనను లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా చూడటమే వారి ఉద్దేశమని విమర్శించారు.

“ఎనిమిది నెలల క్రితం నన్ను సీబీఐ పిలిపించింది నేను వెళ్లాను. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయనీయకుండా విచారణ పేరుతో నన్ను ఈడీ పిలుస్తోంది. బీజేపీ.. ఇతర పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ విచారణ జరిపి, ఆ తర్వాత వారిని తమ పార్టీలో చేర్చుకున్నాయి. అలా బీజేపీ తీర్థం పుచ్చుకున్న వారిపై కేసులు ఎత్తివేశారు. చేరని వారిని జైలుకు పంపిస్తున్నారు. బీజేపీలో చేరేందుకు నిరాకరించినందుకు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ జైలుకు వెళ్లారు. ఇలా అయితే దేశం ఎలా ముందుకు సాగుతుంది. నా శరీరం, మనసు, సంపద దేశం కోసమే. నా ఊపిరి, రక్తంలోని ప్రతి చుక్క దేశం కోసమే.” అని ఈ సందర్భంగా కేజ్రీవాల్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news