వైసీపీలో అవకాశం లేకనే షర్మిల.. తెలంగాణలో పార్టీ పెట్టింది : వై వీ సుబ్బారెడ్డి

-

వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసింది ఆ పార్టీ అధ్యక్షరాలు వై.ఎస్.షర్మిల.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, పలువురు సినీయర్ నేతల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా.. ఆంధ్రలో అయినా.. అండమాన్ లో అయినా పని చేస్తానని ప్రకటించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ప్రధానంగా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

 వైసీపీలో అవకాశం లేకనే షర్మిల.. తెలంగాణలో పార్టీ పెట్టుకుంది అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. షర్మిలతో సహా ఎవ్వరూ ఏ పార్టీలో చేరినా, ప్రజల ఆశీస్సులు జగన్ పైనే ఉన్నాయి. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసింది. ప్రత్యేకంగా పార్టీ పెట్టడం.. పార్టీని విలీనం చేయడం అది ఆమె ఇష్టం అని చెప్పుకొచ్చారు. తాజా నిర్ణయంతో ఏపీకి కానీ, రాజకీయాలకు కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. షర్మిలతో సహా ఎవ్వరూ ఏ పార్టీలో చేరినా ఎన్ని పార్టీలు కలిసి కూటమిగా చేరినా ప్రజల ఆశీస్సులు సీఎం జగన్ పైనే ఉన్నాయన్నారు సుబ్బారెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news