డంపింగ్ యార్డులో మంటలు.. పొగతో దిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి

-

దేశరాజధాని దిల్లీని తరచూ ఓ సమస్య వేధిస్తూ ఉంటుంది. శీతాకాలంలో పొగమంచు వేధిస్తే.. ఇప్పుడు అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా దిల్లీలోని గాజీపుర్లోని డంపింగ్ యార్డులో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. దాదాపు 10 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేపట్టడంతో పెద్ద ఎత్తున పొగ చెలరేగి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. దట్టమైన పొగల కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారిందని స్థానికులు తెలిపారు.

భారీగా పేరుకుపోయిన వ్యర్థాల నుంచి ఉత్పత్తి అయ్యే వాయువుల కారణంగా ఈ మంటలు మరింత వ్యాపిస్తున్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని దిల్లీ ఫైర్ సర్వీస్ ఎస్ఓ నరేశ్ కుమార్ వెల్లడించారు. మరోవైపు ఈ దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని, నిద్ర లేచే సరికి ప్రాంతమంతా పొగతో ఉందని వాపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version