ఢిల్లీ హైకోర్టు గురువారం వికీపీడియాకు కోర్టు నోటీసులను జారీ చేసింది. ఇక వివరాల లోకి వెళితే.. ANI వికీపీడియా పేజీలో సవరణలు చేసిన వ్యక్తుల సమాచారాన్ని బహిర్గతం చేయాలని కోర్టు ఆదేశాలను పాటించలేదు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు గురువారం వికీపీడియాకు కోర్టు నోటీసు జారీ చేసినట్టు బార్ అండ్ బెంచ్ నివేదించింది.
అలాగే ‘మీకు ఇండియా నచ్చకపోతే దయచేసి భారత్‌లో పని చేయకండి. భారత్‌లో వికీపీడియాను బ్లాక్ చేయమని ప్రభుత్వాన్ని కోరతాం’ అని సుప్రీం కోర్టు పేర్కొంది. వార్తా సంస్థ ANI మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పరువు నష్టం కలిగించే వివరణపై ఢిల్లీ హైకోర్టులో వికీపీడియాపై దావా వేసింది.
వార్తా సంస్థ పేజీలో పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించకుండా వికీపీడియాను నిరోధించాలని ANI కోరింది. అంతే కాక కంటెంట్ ని తీసివేయాలని కూడా ఏజెన్సీ కోరింది. దీనితో పాటు ANI వికీపీడియా నుండి 2 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని కోరింది.