బుల్డోజర్ రాజకీయాలు మానేయండి – మాయావతి

-

ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. పలు కేసులలో నిందితులుగా ఉన్న వారి అక్రమ కట్టడాల కూల్చివేతలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే తాజాగా ఈ బుల్డోజర్ రాజకీయాలపై స్పందించారు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి.

బుల్డోజర్ రాజకీయాలు మానేయాలని, వన్యప్రాణుల నుంచి ప్రజలను కాపాడడానికి చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ కి సూచించారు. గురువారం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. జనావాసాల్లోకి చొరబడి ప్రజలపై దాడి చేస్తున్న వన్యప్రాణుల కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలని హితవు పలికారు.

బుల్డోజర్ చర్యలను కోర్టు తప్పు పట్టడంతో బిజెపి – ఎస్పీ మధ్య మాటలు యుద్ధం నడుస్తున్న వేళ మాయావతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక బిజెపి – ఎస్పీ మధ్య మాటల యుద్ధానికి మొదట అఖిలేష్ తెరతీయగా.. దేనికైనా దమ్ము ఉండాలి అంటూ యోగి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news