ఎన్నికల ఎఫెక్ట్.. డిటెక్టివ్ ఏజెన్సీలకు పెరుగుతున్న డిమాండ్!

-

దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంటోంది. షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఓవైపు తమ విజయంపై దృష్టి సారిస్తూనే మరోవైపు తమ ప్రత్యర్థుల కదలికలపై నిఘా పెడుతున్నాయి. వారి వ్యూహాలు పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ప్రైవేటు వ్యక్తులను, డిటెక్టివ్ ఏజెన్సీలను కూడా నియమించుకుంటున్నాయి. దీంతో లోక్సభ ఎన్నికల్లో ప్రైవేటు డిటెక్టివ్‌ ఏజెన్సీలకు భారీ గిరాకీ పెరుగుతున్నట్లు సమాచారం.

ప్రత్యర్థుల అవినీతి, నేర చరిత్ర, కుంభకోణాలు, అక్రమ సంబంధాలు, సంబంధిత వీడియోలు, అనుసరించాల్సిన వ్యూహాలే ప్రధాన అంశాలుగా డిటెక్టివ్‌లను రాజకీయ పార్టీలు నియమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులతో తమ సహాయకులు, సిబ్బంది కుమ్మక్కు అవుతున్నారా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. అభ్యర్థుల జాబితాలో పేర్లు లేకపోవడం వల్ల నిరాశకు గురైన వారితోపాటు, సీటు పొందిన వారు తమ ప్రత్యర్థుల బలాలను తెలుసుకునేందుకు డిటెక్టివ్‌లను సంప్రదిస్తున్నారని దిల్లీ కేంద్రంగా పనిచేసే జీడీఎక్స్‌ డిటెక్టివ్స్‌ లిమిటెడ్‌ సంస్థ తెలిపింది. ఎన్నికల సమయంలో రాజకీయ నిఘా అనేది ఎంతోకాలంగా ఉందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version