కుటుంబంతో కలిసి అయోధ్య రాముడిని దర్శించుకున్న ప్రియాంక చోప్రా

-

గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా ఇటీవలే ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక్కడ కొన్ని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంది. పలు బ్రాండ్ మీటింగ్స్కు అటెండ్ అయింది. తన కుమార్తె మాల్తీ మేరీతో కలిసి ప్రియాంకా భారత్కు వచ్చింది. అయితే పీసీ వచ్చిన రెండ్రోజుల తర్వాత తన భర్త, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ కూడా భారత్ చేరుకున్నాడు. ఇక తాజాగా ఈ జంట తమ కుటుంబంతో కలిసి అయోధ్య రాముడిని దర్శించుకుంది.

ప్రియాంక చోప్రా, నిక్‌ జోనస్‌, పీసీ తల్లి మాలతీ చోప్రా, కుమార్తె మాల్తీ మేరీ, ఇతర బంధువులు కలిసి అయోధ్యలోని బాలరాముడిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ప్రియాంక-నిక్‌ దంపతులు బాలరామునికి పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారులు, భద్రతా సిబ్బందితో కలిసి ఫొటోలు దిగారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మొదటిసారి ప్రియాంక-నిక్‌ జోనస్‌ దంపతులు రామాలయాన్ని సందర్శించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫారినర్ అయిన నిక్ భారతీయుడి గెటప్లో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version