ఈసారి భారత్ కచ్చితంగా ప్రపంచకప్ సాధిస్తుందని టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ధీమా వ్యక్తం చేశారు. నిన్నటి మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వికెట్లు తీసి ప్రపంచంలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ దీపావళి కానుక ఇచ్చారని అభినందించారు. సెమీఫైనల్, ఫైనల్లోను భారత్ ఇదే జోరు కొనసాగించాలని గబ్బర్ ఆకాంక్షించారు.
కాగా వరల్డ్ కప్ 2023 టోర్నమెంటులో టీమిండియా మరో రికార్డును చేరుకుంది. ప్రపంచ కప్ టోర్నమెంట్లో టీమిండియా తన రికార్డును… తానే బద్దలు కొట్టుకుంది. ప్రపంచ కప్ లో వరుసగా తొమ్మిది మ్యాచ్లు గెలిచి అదరహో అనిపించింది టీమిండియా. 2003 వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా ఎనిమిది మ్యాచ్లు నెగ్గింది. ఇప్పుడు 9 గెలిచి ఆ రికార్డును తిరగరాసింది టీమిండియా. ఇక ఓవరాల్ గా ఆస్ట్రేలియా వరుసగా 11 మ్యాచ్లు ఆడి గెలిచింది. 2003 మరియు 2007 ప్రపంచ కప్ లలో ఆస్ట్రేలియా ఈ రికార్డు నెలకొల్పింది. సెమిస్ మరియు ఫైనల్ లోను టీమిండియా గెలిస్తే ఆ రికార్డు సమం అవుతుంది.