వాహనదారులకు గుడ్ న్యూస్.. టెస్ట్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్..!

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని మీరు అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇప్పుడు ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి అంటే ఆర్‌టీవో ఆఫీస్‌ల ముందు లైన్‌లో గంటల కొద్ది నిలుచోవాల్సిన పని లేదు. ఈజీగా లైసెన్స్ ని పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించి కొత్త రూల్స్ వచ్చాయి. కేంద్ర రోడ్డు రవాణ రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు సంబంధించి కొన్ని రూల్స్‌ను సవరించింది. వాటి కోసం చూస్తే..

గుర్తింపు పొందిన డ్రైవింగ్ సెంటర్ల నుంచి డ్రైవింగ్ కోర్సు ద్వారా డ్రైవింగ్ నేర్చుకున్న వారు మ్లీ డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరు కావాల్సిన పని లేదు అని అంది. ఈ కొత్త రూల్స్ జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి.

అయితే గుర్తింపు పొందిన డ్రైవింగ్ సెంటర్లలోనే ట్రాక్స్ ఉంటాయి. డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత వీటిల్లో వెహికల్ నడిపితే చాలు అని అంటున్నారు. దీనితో మీరు ఆర్‌టీవో ఆఫీస్‌ కి వెళ్ళక్కర్లేదు. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ కోర్సు 4 వారాల్లో 29 గంటలు ఉంటుంది. మీడియం అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ కోర్సు 6 వారాల్లో 38 గంటలు ఉండాలి.