హైదరాబాద్: స్వచ్ఛ భారత్‌లో భాగంగా చెత్త రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బహిరంగ మురికి కాల్వల్లో చెత్త వేయకుండా, రోడ్డు పక్కన చెత్త వేయకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.
అయినా కొందరు ఉల్లంఘించారు. అటువంటి వారికి జరిమానా విధించారు. బహిరంగ మురికినీటి కాలువల్లో చెత్త వేసినందుకు గత సంవత్సరంలో రూ .4.63 లక్షలు వసూలు చేసిందని, రోడ్లపై చెత్తకుప్పలు వేసినందుకు ప్రజలకు జరిమానాలు రూ. 10,000 జరిమానా విధించినట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి)కు జీహెచ్ ఎంసీ కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొంది.
ఇక చెత్త రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే భాగంలో 2016లో జీహెచ్ఎంసీ, తెలంగాణ పోల్యూషన్ బోర్డు సంయుక్తంగా ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులను నియమించారు. టీఎస్‌పీసీబీ ఇంజనీర్‌తోపాటు హైదరాబాద్ అదనపు కలెక్టర్, జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌ను నియమించారు. నగరమంతా తిరిగి ఈ సభ్యులు నివేదికను తయారు చేశారు. ఈ నివేదికను ఎన్జీటీకి సమర్పించారు.
‘‘హైదరాబాద్‌లో 3,515 శాట్ వాహనాలు తిరుగుతున్నాయి. నగరమంతా చెత్తను సేకరించి తడి, పొడిగా వేరు చేసి విద్యుత్ ఉత్పత్తకి వినియోగిస్తున్నారు. ఇలా నగరంలో రోజు 5,978 టన్నుల సేకరిస్తున్నారు. చెత్త సేకరణతో తొలుత 19.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పతి అయింది. ప్రస్తుతం మొత్తం 48 మెగావాట్లకు పెరిగింది. ’’ అని కమిటీ స్పష్టం చేసింది.
హైదరాబాద్ వాసులు బిన్ రహిత నగరం అనే ఆలోచనను స్వీకరించారని తెలిపారు. నగర వాసుల్లో వచ్చిన మార్పు కారణంగా వ్యర్థాలను స్వాచ్ ఆటో టిప్పర్స్ (సాట్)కు అప్పగిస్తున్నారని, ఎక్కువ మంది ప్రజలు వ్యర్థాలను వేయడం మానేశారని పేర్కొన్నారు.