డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్ నెంబర్ లింక్ చేస్తే కలిగే బెనిఫిట్స్ ఇవే..!

-

ఆధార్ అన్నింటికీ చాల ముఖ్యం. అదే విధంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా అన్నింటికీ చాల అవసరం. అయితే డ్రైవింగ్ లైసెన్స్ కనుక లేక పోతే వెహికల్ నడటపం కుదరదు. చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేక పోవడం నేరం. అయితే డ్రైవింగ్ లైసెన్స్ తో ఆధార్ ని లింక్ చేసుకోవడం వలన ఏ బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

రెండిటినీ లింక్ చెయ్యడం వలన ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ గురించి సులభంగా తెలుసుకో వచ్చు. అంతే కాకుండా ప్రభుత్వాలు అందించే సర్వీసులు, పథకాల ప్రయోజనాలు ఎలాంటి అంతరాయం లేకుండా పొందొచ్చు.

అలానే సెంట్రల్ ఆన్‌లైన్ డేటా బేస్‌లో మీ వివరాలు సేవ్ అవుతాయి. దీంతో దేశ వ్యాప్తంగా డూప్లికెట్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవడం కుదరదు

ఆధార్‌ తో లైసెన్స్ లింక్ చేస్తే కనుక ఆథరైజ్డ్ ఏజెన్సీలకు మీ డ్రైవింగ్ లైసెన్స్‌ ధ్రువీకరణ ఈజీ అవుతుంది కూడా. మీ రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌కు వెళ్లి లింక్ ఆధార్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈజీగా ఆధార్ నెంబర్‌తో డ్రైవింగ్ లైసెన్స్ లింక్ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా ఇంట్లో వుండే లింక్ చేసుకో వచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news