వరుస రైలు ప్రమాదాలు ఒడిశా ప్రజలను వణికిస్తున్నాయి. ఇటీవలే ఆ రాష్ట్రంలో జరిగిన రైలు ప్రమాదం యావత్ భారతదేశాన్ని పెను విషాదంలోకి నెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఒడిశాలో మరో రైలు ప్రమాదానికి గురైంది. నౌపడా జిల్లాలోని ఖరియార్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద పూరీ-దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. రైలులోని ఏసీ కోచ్‌లో గురువారం రాత్రి పది గంటల సమయంలో మంటలు చెలరేగాయి. బ్రేక్ ప్యాడ్‌లో లోపం వల్ల మంటలు వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు.
బీ3 కోచ్‌లో మంటలు గుర్తించామని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. బ్రేకులను పూర్తిగా వదిలేయకపోవడం వల్ల రాపిడి తలెత్తి మంటలు అంటుకున్నాయని వెల్లడించింది. బ్రేక్ ప్యాడ్ మినహా.. రైలుకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. కోచ్ లోపలకు మంటలు వ్యాపించలేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. మంటలు గుర్తించిన వెంటనే అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయని వివరించింది. సమస్యను పరిష్కరించిన తర్వాత రైలు బయల్దేరిందని పేర్కొంది.