నాగచైతన్య లేటెస్ట్ మూవీ కస్టడీ మే 12వ తేదీన థియేటర్లలో సందడి చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద డీలా పడింది. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నాగ చైతన్య ఈ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో నటించాడు. కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించారు. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమా తెలుగు – తమిళ భాషల్లో రూపుదిద్దుకుంది.
అయితే ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఎట్టకేలకు కస్టడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రైమ్ ట్వీట్ పెట్టింది. తెలుగు, తమిళంతోపాటు కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్న జాలీగా.. హ్యాపీగా.. మీ ఆత్మీయులతో కలిసి నాగచైతన్య-కృతిల కస్టడీ చూసేయండి. వీకెండ్ ఎంజాయ్ చేయండి.