అరుణాచల్ ప్రదేశ్​లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత

-

అరుణాచల్ ప్రదేశ్​ పశ్చిమ సియాంగ్ జిల్లాలో ఇవాళ భూకంపం వచ్చింది.  భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు సంభవించాయని జిల్లా సమాచారా, పౌర సంబంధాల అధికారి తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని జిల్లా విపత్తు అధికారి నిమా దోర్జీ వెల్లడించారు.

మరోవైపు ఇవాళ తెల్లవారుజామున అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో స్వల్ప భూకంపం వచ్చింది.  2.29 గంటల సమయంలో పోర్ట్‌బ్లేయిర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.

మరోవైపు ఈనెల 9న నేపాల్ లోనూ భూకంపం వచ్చింది. రిక్టరు స్కేలుపై 6.6 తీవ్రత నమోదైంది. భూ ప్రకంపనల వల్ల అక్కడ ఇళ్లు కూలి ఆరుగురు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఇవాళ పశ్చిమ నేపాల్ మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news