దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు..  కేజ్రీవాల్‌ ఫోన్‌పై ఈడీ ఫోకస్‌

-

దిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్‌ కనిపించడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను దర్యాప్తు అధికారులు ఆదివారం రోజున నాలుగు గంటలపాటు ప్రశ్నిస్తూ.. పాలసీ రూపొందించే సమయంలో ఏ ఫోన్‌ ఉపయోగించారని అడిగారు. అయితే ఆయన తనకు గుర్తు లేదని సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. అందులోనే కీలక ఆధారాలు ఉన్నట్లు భావిస్తున్న ఈడీ  దాన్నుంచి ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్‌ మహేంద్రుతో ఆయన మాట్లాడినట్లు ఆరోపిస్తోంది.

మరోవైపు, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా వ్యక్తగత కార్యదర్శి సి.అరవింద్‌తో కలిపి కేజ్రీవాల్‌ను మంగళవారం విచారించనుంది. ఈ కేసులో కేజ్రీవాల్‌ కింగ్‌పిన్‌గా వ్యవహరించారని ఈడీ ఆరోపించిన విషయం తెలిసిందే. సౌత్‌ గ్రూప్‌కు, దిల్లీ ప్రభుత్వానికి మధ్యవర్తిగా ఆప్‌ మీడియా విభాగం ఇన్‌ఛార్జ్‌ విజయ్‌ నాయర్‌ వ్యవహరించారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. దీని ద్వారా కేజ్రీవాల్‌ కోట్ల రూపాయలు ముడుపులు అందుకున్నారని కోర్టుకు తెలిపింది. .

Read more RELATED
Recommended to you

Latest news